మునక్కాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
పెసరపప్పును రాళ్లు లేకుండా చూసుకొని బాగా శుభ్రపరిచి తగినన్ని నీళ్లు పోసి 10 నుండి 15 నిమిషాలు నానబెట్టాలి.
ఉల్లిపాయ, టమాటో లను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత పోపుదినుసులు(అందులో ఆవాలు, శనగపప్పు, మినపపప్పు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి) వేసి ఆవాలు చిటపటలాడనివ్వాలి.
తర్వాత మునక్కాయ, ఉల్లిపాయ, టమోటో ముక్కలు వేసి మూత పెట్టి సన్నని మంట పైన మగ్గనివ్వాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి బాగా కలపాలి.
మునక్కాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత, ముందుగా నానబెట్టి ఉంచిన పెసరపప్పును నీటితోపాటు మునక్కాయ మిశ్రమం లో వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి.
పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు మధ్యలో అడుగు మాడకుండ కలుపుతూ, అవసరమైతే ఇంకొంచం నీటిని కూడా అందులో కలపాలి.
మునక్కాయ ముక్కలు, పెసరపప్పు ఉడికిన తర్వాత గరం మసాలా వేసి కలిపి ఉప్పు కారం సరిచూసుకోవాలి.
కూరకొంచం పలుచగా ఉన్నప్పుడే పొయ్యి ఆపెయ్యాలి. 10 నిముషాలు ఆగిన తరవాత అన్నం తో కలిపి వడ్డించుకోవాలి.