
Drumstick Green-gram curry(మునక్కాయ-పెసరపప్పు కూర)
Equipment
- Vessel
- Knife
Ingredients
- 3 piece మునక్కాయలు
- 1 cup పెసలపప్పు
- 1 big size ఉల్లిపాయ
- 1 big size టొమాటో
- ½ tsp పసుపు
- 1 tbsp కారం
- ½ tsp ఆవాలు
- ½ tbsp మినపపప్పు
- ½ tbsp శనగపప్పు
- 1 stem కరివేపాకు
- 3 tbsp నూనె
- 1 tbsp ఉప్పు / తగినంత
- 1 tbsp ధనియాలపొడి
- 1 tsp గరంమసాలా పొడి
Instructions
- మునక్కాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
- పెసరపప్పును రాళ్లు లేకుండా చూసుకొని బాగా శుభ్రపరిచి తగినన్ని నీళ్లు పోసి 10 నుండి 15 నిమిషాలు నానబెట్టాలి.
- ఉల్లిపాయ, టమాటో లను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
- కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత పోపుదినుసులు(అందులో ఆవాలు, శనగపప్పు, మినపపప్పు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి) వేసి ఆవాలు చిటపటలాడనివ్వాలి.
- తర్వాత మునక్కాయ, ఉల్లిపాయ, టమోటో ముక్కలు వేసి మూత పెట్టి సన్నని మంట పైన మగ్గనివ్వాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి బాగా కలపాలి.
- మునక్కాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత, ముందుగా నానబెట్టి ఉంచిన పెసరపప్పును నీటితోపాటు మునక్కాయ మిశ్రమం లో వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి.
- పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు మధ్యలో అడుగు మాడకుండ కలుపుతూ, అవసరమైతే ఇంకొంచం నీటిని కూడా అందులో కలపాలి.
- మునక్కాయ ముక్కలు, పెసరపప్పు ఉడికిన తర్వాత గరం మసాలా వేసి కలిపి ఉప్పు కారం సరిచూసుకోవాలి.
- కూరకొంచం పలుచగా ఉన్నప్పుడే పొయ్యి ఆపెయ్యాలి. 10 నిముషాలు ఆగిన తరవాత అన్నం తో కలిపి వడ్డించుకోవాలి.
Notes
- పెసరపప్పు కూర వండేప్పుడు నీళ్లు త్వరగా ఇంకిపోతాయి కావున అప్పుడప్పుడు అవసరమైన నీటిని కలుపుకోవాలి.
- పెసరపప్పును మునక్కాయ మిశ్రమంలో వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి. మునక్కాయలు చెదిరిపోకుండా ఉంటాయి.
- పెసరపప్పు కూర ఉడికించి దించుకున్న తర్వాత నీటిని పీల్చుకొని గట్టిపడుతుంది కావున కొంచం పలుచగా వున్నప్పుడే పొయ్యి ఆపెయ్యాలి.
Similar Posts
-
Authentic Nellore chepala pulusu (Fish curry) – Hard Core
Vikrama simhapuri was the original name of Nellore till about the 13th Century, after which it got i
-
Dumplings (pulibongaralu) – Raji’s
Dumplings/Puli bongaralu is an Indian food made for breakfast and evening snack as well. Traditional
-
Bitter gourd chutney powder – Hard Core
Bitter gourd: a vegetable I have not been fond of all my life. But a vegetable that is loved by my h
-
Simple Chicken fry – Raji’s
Have you ever wondered making restaurant style simple chicken fry at home? Easily make these at home
-
Whole wheat Chocolate Brownie – Hard Core
Brownie Love, the Healthy Way 🍫💚 If there’s one dessert, I’ve never been able to resist, it’s the go